Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఇంటి పైకప్పు నుంచి జారి ఒకరు కాపాడబోయి మరొకరు

Two children murdered in house at Secunderabad

సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఇద్దరు చిన్నారుల దుర్మరణం  

మన తెలంగాణ / సికింద్రాబాద్ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం సాయంత్రం ఇంటి భవనంపైకి ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు అక్కడి నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఏడాదిన్నర పాప శ్రేయ భవనం పైకప్పు చివరకు వెళ్లి కింద పడిపోబోతుండడంతో ఆమెను కాపాడడానికి పదేళ్ల పల్లవి ప్రయత్నించింది. దాంతో ఒకరి తరువాత ఒకరు కింద పడ్డారు. శ్రేయ అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్ర గాయలపాలయిన పల్లవిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పల్లవి కూడా మృతి చెందింది. దీంతో చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.   శ్రేయ , పల్లవి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చిలకలగూడ పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  విషయం తెలుసుకున్న పలువురు ప్రజా ప్రతినిధులు బాధితులను పరామర్శించారు.

Comments

comments