Home తాజా వార్తలు చెట్టును ఢీకొట్టిన బైక్.. ఇద్దరు దుర్మరణం…

చెట్టును ఢీకొట్టిన బైక్.. ఇద్దరు దుర్మరణం…

Accidentవికారాబాద్‌: వేగంగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్‌ మండలం రావల్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Two Dead after Bike collision with Tree in Vikarabad