Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు మృతి…

కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు మృతి…

Road Accidentఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అరకులోయ మండలం యండపల్లివలస శివారులో వేగంగా వచ్చిన ఓ బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకుడిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Two dead after bike crashed into the canal