Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

విందు భోజనం వికటించి ఇద్దరు మృతి!

2 dead after food poisoning in Function : West Godavari District

అమరావతి: విందు భోజనం వికటించడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్‌లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి, విందు భోజనం చేశారు అనంతరం కొద్దిసేపటికే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Comments

comments