Home తాజా వార్తలు బావిలో రెండు శవాలు లభ్యం

బావిలో రెండు శవాలు లభ్యం

Two-Dead-Bodies-Found-in-we

జహీరాబాద్: ఓ వ్యవసాయ బావిలో రెండు గుర్తు తెలియని శవాలు కనిపించిన ఘటన  సంగారెడ్డి  జిల్లాలోని జహీరాబాద్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. రెండు మృతదేహాలు బావిలో కనిపించడంతో రైతులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బావి నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.