Home తాజా వార్తలు చెన్నపురం చెరువులో రెండు మృతదేహాలు…

చెన్నపురం చెరువులో రెండు మృతదేహాలు…

Unidentified woman and man bodies found in vikarabad district

హైదరాబాద్: సికింద్రాబాద్‌ జవహర్‌నగర్ పరిధిలోని చెన్నపురం చెరువులో బుధవారం ఉదయం రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.