Home జాతీయ వార్తలు ముంబై లో వర్షంతో 2 డి ఎఫెక్ట్ …

ముంబై లో వర్షంతో 2 డి ఎఫెక్ట్ …

Image-in-Water

భారీ వర్షాలతో ముంబై సంద్రమైంది. మురికివాడలు, విలాసవంత ప్రాంతాలు, బస్తీలు, రాదార్లు, స్టేషన్ల తేడా లేకుండా అంతా జలమయం అయింది. ముంబై ఇప్పుడు భారీగా నిలిచిన నీటి అద్దంలో తనను తాను చూసుకుంటున్న వైనంగా మారింది. సిఎస్‌టి గేట్, ఇండియా గేట్, తాజ్ హోటల్, రైల్వే స్టేషన్ వంటి పలు బహుళ అంతస్తుల భవనాలు, అనేక చారిత్రక కట్టడాలు చుట్టూ నిలిచిన నీటి మడుగులలో రాత్రిపూట  విద్యుత్ కాంతుల వెలుగులలో తళుక్కుమంటున్నాయి. వరద నీటిలో ముంబై సంతరించుకున్న టూ డీ టైప్ కళను ప్రముఖ ఫొటోగ్రాఫర్ల కెమెరాలే కాదు …చేతిలో సెల్ ఉన్న సామాన్యులు కూడా క్లిక్ ముంబై థండర్ వానలో వండర్‌ను దూర ప్రాంతాల వారికి వాట్సాప్‌లలో సందేశాలుగా పంపిస్తున్నారు.