Home ఆదిలాబాద్ వడదెబ్బకు ఇద్దరు మృతి

వడదెబ్బకు ఇద్దరు మృతి

HEATఆదిలాబాద్: జిల్లాలోని దండేపల్లి మండలంలో ఆదివారం వడదెబ్బకు ఇద్దరు మృత్యువాతపడ్డారు. స్థానికంగా ఉండే పొదిల పున్నమ్మ(55) వడదెబ్బతో అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం చనిపోయింది. ఇదే మండలంలోని వెలగనూరు గ్రామానికి చెందిన మానం రాయబోసు(60) వడదెబ్బకు స్వృహ తప్పిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. భానుడి ప్రతాపం ఈ నెలలోనే ఇలా ఉంటే వచ్చే మాసంలో ఇంకా ఎలా ఉంటాయో అని జనాలు భయపడిపోతున్నారు.