Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

విషాద చరమగీతి 

Two elderly couples Commit Sucide

కొడుకులకు భారమవుతామని భావించి తనువు చాలించిన తల్లిదండ్రులు
హైదరాబాద్ కాప్రా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న కాశయ్య, సులోచన

మన తెలంగాణ/ చర్లపల్లి : అనారోగ్య సమస్యలతో కన్న కొడుకులకు భారం అవుతున్నామన్న మనోవేదనతో ఇద్దరు వృద్ధ దంపతులు చెరువులో దూకి మృతి చెందిన ఘటన కాప్రా గాంధీనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల కాశయ్య (75), సులోచన (67)  కాప్రా గాంధీనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు వెంకటేష్, రవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందరికీ వివాహం అయిది. గత ఏడాది కాలంగా వీరు ఇరువురు పక్షవాతంతో బాధపడుతున్నారు. తరుచుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. కాశయ్య పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. దీంతో తీవ్ర కలత చెందిన వృద్ధు లు కొడుకులకు భారం అవుతున్నామని,  చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, సోమవారం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళుతున్నామని ఇంట్లో చెప్పిన వృద్ధులు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి నుంచి బయటకు వచ్చి కాప్రా చెరువులో పిండాలు పెట్టాలి అని చెప్పి ఆటోలో కాప్రా చెరువు వద్దకు చేరుకున్నారు. తమ వద్ద ఉన్న ఆసుపత్రి పత్రాలు, చెప్పులు వదిలి చెరువులో దూకారు. రాత్రి పొద్దుపోయే వరకు అమ్మనాన్నలు ఇంటికి రాకపోవడంతో తెలిసిన వారిని, బంధువులను వాకబు చేసిన కుమారులు సోమవారం రాత్రి పది గంటల వరకు వెదికి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని మంగళవారం ఉదయం గాంధీనగర్ ఆటోఅడ్డా దగ్గర ఆటో డ్రైవర్లను విచారించగా కాప్రా చెరువులో పిండాలు పెట్టాలని ఇద్దరు వృద్ధులు తన ఆటోలో వచ్చారని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కాప్రా చెరువుకు వెళ్లే దారులలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించి కాప్రా చెరువు వద్దకు చేరుకున్నారు. కాప్రా చెరువు గట్టు వద్ద చెప్పులు కనిపించడంతో చెరువులో గజఈతగాళ్లతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాశయ్య శవం దొరికింది. రాత్రి వరకు వెతికినా సులోచన శవం దొరకలేదు. కాశయ్య శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

Comments

comments