Home రాష్ట్ర వార్తలు ఇద్దరు రైతుల ఆత్మహత్య

ఇద్దరు రైతుల ఆత్మహత్య

FARMERమరిపెడ : సాగు నీరు అందక… సాగు నీరు కోసం చేసిన అప్పులు తీరకపోవటం మూలన మనస్థాపం చెందిన ఓ గిరిజన రైతు ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో బలవన్మరాణినికి పాల్పడ్డాడు.వరంగల్ జిల్లా సరిహద్దులోని డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలం బీచురాజు పల్లి శివారు జర్పుల తండాకు చెందిన భద్రునాయక్(42) తనకు ఉన్న ఒక ఎకారం సాగుకు తోడు మరో రెండు ఎకారాలు తండాలో కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో ఈ ఏడాది వేసిన పంటలు పంట తెగుళ్ల మూలంగా చేతికి పంట అందే పరిస్థితి లేకపోవటం మూలన మనస్థాపం చెందిన భద్రునాయక్ కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోని కరెంట్ తీగ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాట్లు కుటుంభీకులు బోరున విలపిస్తు చెప్పారు.ఈ ఏడాది వరికి దోమకాటు మిరపకు వైరస్ సోకటంతో పాటు పత్తికి ఆగ్గితేమ వ్యాప్తించటం మూలన పంటలు కాపడుకోవటం కోసం భద్రు తెలిసిన చోట్ల అప్పులు తెచ్చి వివిధ రకాల మందులు పిచికారి చేసిన ఫలితం లేకపోయింది. పిల్లలు చేతికి అంది ఉన్నత చదవులు చదువుతున్న క్రమంలో అప్పుల పాలు కావటంతో విసుగు చెందిన భద్రు మృతిచెందాటం తమను కలిచి వేసిందని తండా వాసులు సైతం బోరున విలపించారు.మృతినికి ముగ్గురు పిల్లలున్నారు.మొదటి కూతులు బిటెక్ చదువుతుండగా కూమారులు ఇంటర్,పదవ తరగతి చదువుతున్నారు.మృతిని కుటుంభానికి స్థానిక తెరాస నేత గూడిపూడి నవీన్ రూ.2వేల ఆర్థిక సాయం చేసి సంతాపం వెలిబుచ్చారు.
చేర్యాలలో.. మండలంలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన దండ్యాల తిరుమల్ రెడ్డి(36) అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. మృతుని బార్య పోలీసులకు ఫిర్యాదు ప్రకారం మాకు 5 ఎకరాల వ్యవసాయ బూమి ఉందని పంటలు సరిగా పండక 5 లక్షల వరకు అప్పులు ఐనట్లు ఈ రోజు ఏదయం బావి దగ్గర పరుగుల మందు తాగడంతో సిద్దిపేటకు తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపింది.మృతునికి బార్య ఒక కుమారుడు,కుమార్తె ఉన్నట్లు తెలిపారు.ఎసై రవిందర్‌ను వివరణ కోరగా మృతుని బార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.