Home తాజా వార్తలు వరికోత యంత్రం ఢీకొని ఇద్దరు రైతులు మృతి…

వరికోత యంత్రం ఢీకొని ఇద్దరు రైతులు మృతి…

Former-death-image

వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలం అప్పరాలలో విషాదం చోటుచేసుకుంది. వరికోత యంత్రం ఢీకొని ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. పొలంలో పని చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రైతులు తెలిపారు. మృతిచెందిన వారు బాలస్వామి(60), రాములు (35)గా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి.