Search
Monday 24 September 2018
  • :
  • :

ఇద్దరు రైతుల ఆత్మహత్య

Farmersగార్ల : మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలంలో అప్పుల భారంతో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకున్న ఎకరం పొలంతో పాటు కౌలుకు తీసుకున్న పొలంలోనూ వేసిన పంట ఎండిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఈ విషాధకర ఘటన మండలంలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తనకున్న ఎకరం పొలంలో మొక్కజొన్న పంట, కౌలుకు తీసుకున్న పొలంలో వేసిన వరిపంట తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల చేతికందకుండా పోయింది. కుటుంబ పోషణకు చేసిన అప్పులు అధిక మవడంతో మనస్తాపం చెంది కౌలు పొలం వద్దనే పురుగుల మందు సేవించి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. కాగా, ఖమ్మం జిల్లా గార్ల మండల పరిధిలోని పోచారం పంచాయితీ కోట్యానాయక్ తండాకు చెందిన భూక్య వీరన్న (26) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలు పండకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వ్యవసాయానికి తీసుకువచ్చిన పురుగు మందును ఈనెల 2న పంట పొలంలో తాగడంతో చుట్టు పక్కల వారు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స జరిపిన వైద్యులు పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజియం ఆసుపత్రికి తరలించారు. 16 రోజల పాటు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు.

Comments

comments