Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు రైతుల ఆత్మహత్య

 తాళ్లపల్లిగూడలో ఉరేసుకొని ఒకరు
 ఎండిన పంటలతో తీవ్ర మనోవేదన
 భూచాన్‌పల్లిలో పురుగు మందు తాగి ఒకరు
 అప్పులు తీర్చలేకే బలవన్మరణం

rr1మంచాల: అప్పుల బాధ తాళలేక ఓరైతు ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి దూలానికి ఉరేసుకొని మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మంచాల మండల పరిధిలోని తాళ్లపల్లిగూడ గ్రామానికి చెందిన కాస మదారి(47) తనకున్న ఎకరం పొలంలో అప్పు చేసి వరి పంటను సాగుచేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు ఎండి పోయి పంట పూర్తిగా ఎండి పోతుండటంతో ఆందోళన చెంది, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుర్లు భార్య ఉన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ ఎంపిపి
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మదారి కుటుంబాని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని మంచాల మండల వైస్‌ఎంపిపి దన్నేభాషయ్య ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్షంతో రుణమాపి పేరుతో రైతులను మేసం చేయడంతో నేడు రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటు న్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 5లక్షల రూపాయలను వెంటనే చెల్లించి, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మర్పల్లిలో..
మర్పల్లి: రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోయాయని వీటి కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలని మనోవేదనతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండలం భూచన్‌పల్లి గ్రామంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్ల పాండయ్య (65) రుక్మిణిలు దంపతులు.. వీరికి ఎకరా ఇరువై గుంటల భూమి ఉంది. ఇందులో గత సంవత్సరం పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఈ సంవత్సరమైనా పంటలు బాగా పండించి అప్పులను తీర్చుదామని పెసర, మినుము విత్తనాలను వేసాడు. సరైన సమయంలో వర్షాలు కురియకపోవడంతో అవి పూర్తిగా ఎండిపో యాయి. కొన్నిరోజులకు వర్షాలు కురియడంతో ఎండిపోయిన పోలం లో మల్లి వాము పంటను వేసారు. వర్షాలు ఎక్కువగా కురువడంతో వాము పంటసైతం మొలకెత్తలెదు. దింతో ప్రతిరోజు పంట పెట్టుబ డుల కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలని మనొవెదనతో కృంగిపొ యాడు. సొమవారం ఉదయం కొంతమంది వాకింగ్‌కు పోతు న్నప్పుడు మోడల్ పాఠశాల రోడ్డు పక్కన ఓ వ్యక్తి కిందపడి కొట్టుకొవడం చూసి అయనదగ్గరకువెల్లి చూడగా అతనిని భూచన్‌పల్లికి చెందిన వడ్ల పాండయ్య గా గుర్తించి మర్పల్లిలో ఉన్న అయన కుమారుడు మురారికి తెలియపర్చడంతో అయనతో పాటు మరికొంతమందివచ్చి నురుగులు కక్కుతున్న పాండయ్యను చికిత్సనిమిత్తం మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సచెస్తుండగా మృతిచెందారని వారుతెలిపారు.మృతుడు పాండయ్యకు మర్పల్లి సహకారసంఘంలో 90వేలరుపాయలు,ప్రయివేటుగా 1.50లక్షల అప్పులున్నాయని వారు పెర్కోన్నారు…..కుమారుడు మురారీ పిర్యాదుమెరకు కేసునమొదుచెసుకోని దర్యాప్తు చెస్తున్నట్టు,పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments