Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రెండు హెలికాఫ్టర్లు ఢీ

HELI

పారిస్ : ఆగ్నేయ ఫ్రాన్స్‌లో రెండు సైనిక హెలికాఫ్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ అధికారులు తెలిపారు. మరొకరి జాడ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. సెయింట్ ట్రోపెజ్ పట్టణానికి ఉత్తరాన ఉన్న కార్కస్ సరస్సు సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన రెండు హెలికాఫ్టర్లు ఫ్రెంచ్ ఆర్మీ లైట్ ఏవియేషన్ స్కూల్‌కు చెందినవని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 Two Helicopters Crash : Five died

Comments

comments