Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

ఫోర్బ్ జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు

bsns

న్యూయార్క్: అమెరికాలో 60 మంది సంపన్న మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలు ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. టెక్నాలజీ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథిలు ఈ జాబితాలో స్థానం పొందారు. స్వయంగా సంపాదిస్తూ అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్న వీరు పోర్బ్ ‘అమెరికా 60 రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సంపాధించుకున్నారు. వీరు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఫోర్బ్ పేర్కొంది. ఈ జాబితాలో ఉల్లాల్ 18వ ర్యాంకు, సేథి 21వ ర్యాంకును పొందారు. 57 ఏళ్ల ఉల్లాల్ అరిస్టా నెట్‌వర్క్ అనే కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీకి 2008 నుంచి సిఇఒగా పని చేస్తున్నారు. ఇక 63ఏళ్ల సేథి ఐటీ కన్సల్టింగ్ కంపెనీ సింటెల్‌కు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

Comments

comments