Home అంతర్జాతీయ వార్తలు చైనాలో ఇద్దరు భారతీయులు అరెస్ట్

చైనాలో ఇద్దరు భారతీయులు అరెస్ట్

ARRESTEDబీజింగ్ : తైవాన్ టూరిస్టును వేధించిన కేసులో ఇద్దరు భారతీయులను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణకి చెందిన ఇద్దరు వ్యక్తులు చెందిన టీ కంపెనీలో పనిచేసేందుకు బీజింగ్‌కు వెళ్లారు. ఈ నెల 7న వారు పని చేస్తున్న హోటల్ లిఫ్ట్ వద్ద తైవాన్‌కు చెందిన మహిళా టూరిస్టుతో ఫోటో దిగుతూ.. అసభ్యంగా ప్రవర్తించారు. నిందితుల బారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులు ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. సిసిటివి ఫుటేజిని పరిశీలించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.