Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ధృవ సినిమా చూసి వస్తూ … ఇద్దరి మృతి

road-accident-image-done

జోగులాంబ గద్వాల : రామ్‌చరణ్ నటించిన ధృవ చిత్రాన్ని చూసి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. వావిలాలకు చెందిన 14 మంది రామచరణ్ అభిమానులు శుక్రవారం రాత్రి అయిజలో ధృవ సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం వారు ఆటోలో ఇంటికి బయల్దేరారు. పందెపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో లారీని ఢీకొట్టింది.  ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రాజు, సతీష్ అనే యువకులు చనిపోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Comments

comments