Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సు-బైక్ ఢీ: ఇద్దరు మృతి

Four, Policemen, Were, Injured, Road Accident,Telangana news,Telugu news,Road Accident news in Telugu,Road Accident news Today in Telugu,Road accident news in Hyderabad,Road Accident News in Outer Ring Road,Road Accident in India in Telugu

నల్గొండ: ఆర్‌టిసి బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి ఉప్పువాగు వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుల వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Two Killed in Road Accident in Nalgonda.

Comments

comments