Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

Accident

లక్ష్మిదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం పాలకేంద్రం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన చిట్టిబాబు(26) కొత్త గూడెం నుండి ఇల్లెందుకు బైక్‌పై పోతున్న చిట్టిబాబు, లక్ష్మిదేవిపల్లి మండలం నుండి బైక్‌పై స్థానిక సూపర్‌బజార్‌కు వస్తున్న ఎండి పాషా(33) బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో పాషా అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చిట్టి బాబుకు తీవ్ర గాయాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనకు త్రిటౌన్ సిఐ రాజగోపాల్, ఎస్‌ఐ అంజయ్య, లక్ష్మిదేవిపల్లి ఎస్‌ఐ ముత్యం రమేష్‌లు వెళ్ళి ఘటన వివరాలను తెలుసుకొని మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments