Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మత్తు భోజనం తినిపించి… ఆపై మానభంగం..!

Rape on Girlకోల్ కతా: బ్యూటీ పార్లర్ కు సంబంధించి పని విషయంలో మాట్లాడాలని వచ్చిన ఇద్దరు యువకులు ఓ యువతిని మత్తుమందు కలిసి భోజనం తినిపించి అత్యాచారం జరిపిన సంఘటన కోల్ కత్త నగరంలో చోటుచేసుకుంది. కోల్ కత్తా నగరంలోని ముకుందాపూర్ లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న ఓ యువతితో ఇద్దరు యువకులు మాట్లాడేందుకు వచ్చారు. అదే చనువుతో వారి వద్ద ముందుగానే మత్తుమందు కలుపుకువచ్చిన భోజనాన్ని యువతికి తినిపించారు. యువతి అపస్మారక స్థితిలోకెళ్లగానే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తేరుకున్న యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో అత్యాచారానికి పాల్పడిన రాజ్ కుమార్ మండల్, అమల్ మండల్ లను పోలీసులు అరెస్టు చేశారు. యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

comments