Home ఖమ్మం రెండు లారీల ఢీ… : ఖమ్మం

రెండు లారీల ఢీ… : ఖమ్మం

two lorries accident in khammam
నేలకొండపల్లి: రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కున్నారు. స్థానికులు అతి కష్టం మీద డ్రైవర్ ను బయటకు తీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చెరువుమాధారం క్రాస్‌రోడ్డు వద్ధ ఖమ్మం నుంచి కోదాడ వెళ్లుతున్న బొగ్గు లారీ, కోదాడ నుంచి ఖమ్మం వెళ్లుతున్న మరో లారీ  ఢీ కొన్నాయి. బొగ్గు లారీ రోడ్డు మార్జిన్ దిగి రోడ్డు ఎక్కుతుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. బొగ్గు లారీలో ఉన్న డ్రైవర్ కోటేశ్వరరావు క్యాబిన్ లో ఇరుక్కున్నారు. స్థానికులు లారీలో ఉన్న మోకు సహాయంతో మరో లారీకి కట్టి గుంజి డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీశారు. వెంటననే స్థానిక ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ కు ప్రమాదం తప్పింది.