Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

ఇద్దరు మావోయిస్టులు మృతి

Maoists

భద్రాచలం: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ని దంతెవాడ జిల్లాలో ఆదివారం ఎన్‌కౌంటర్ జరి గింది. పురంగోల్ అటవీ ప్రాంతంలో భద్రతా బల గాలకు మావోయిస్టులు తారస పడడంతో ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముందుగా పొ దల చాటు నుంచిమావోయిస్టులు కాల్పులు జరప గా, వెంటనే తేరుకున్న పోలీసులు తిరిగి మావోయి స్టులపై కాల్పులు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, వారి వద్ద నుంచి పెద్దఎత్తున విప్లవ సాహిత్యం, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, ఔష ధాలు, రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరుస సంఘటనలు..

వారం రోజులుగా మావోయిస్టు కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. గత ఆదివారం 22వ తేదీ రాత్రి మణుగూరు ఏరియా కమిటీ పేరిట లేఖలను విడు దల చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకే చర్ల మండ లంలో మరోసారి లేఖలు వెలిశాయి. అదేవిధంగా చర్ల మండలం తాలిపేరు సమీపం లోని తిప్పారం రోడ్‌లో ఈ నెల 25న ప్రెషర్ బాంబు అమర్చారు. దీనిని పోలీసులు అతి చాకచక్యంగా నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజునే చ త్తీస్‌గఢ్‌లోని జాతీయ రహదారి పనులు నిర్వహిస్తు న్న 4 వాహనాలను తగులబెట్టారు. అదే విధంగా 28న చత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చి మావోయి స్టులు ఓ జవాన్‌ను బలి తీసుకున్నారు.

ఇలా వరుస సంఘటనలతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తు న్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయ త్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఒబి ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు ఉద్యమం ఓ పక్క సన్నగిల్లిం దనే ప్రచారం జోరందుకుంటున్న నేపథ్యంలో వ్యూ హాలకు పదును పెడుతున్నట్లు పలువురు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. సేఫ్‌జోన్‌గా భావించే కటాఫ్ ఏరియా ఎఒబిలోకి సైతం ప్రవేశించిన పో లీసులు ముప్పేట దాడి చేసిన మావోయిస్టులను మట్టికరిపించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే సద్వి నియోగం చేసుకుంటూ ల్యాండ్‌మైన్ల నుంచి తప్పిం చుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారం రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటన లతో అటవీ గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమం టూ కాలం వెల్లదీస్తున్నారు.

Comments

comments