Home జాతీయ వార్తలు ఇద్దరు మావోయిస్టులు ఎన్ కౌంటర్

ఇద్దరు మావోయిస్టులు ఎన్ కౌంటర్

Maoists Encounterఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.

అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎధురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. హతమైన మావోయిస్టుల్లో ఓ మహిళా మావోయిస్టు ఉంది. ఘటనాస్థలి నుంచి విప్లవ సాహిత్యం, మందుగుండు సామగ్రి, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో పోలీసులు మావోయిస్టుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Two Maoists died in Chhattisgarh Encounter