Home తాజా వార్తలు రెండు బైక్‌లు ఢీ: ఇద్దరి మృతి

రెండు బైక్‌లు ఢీ: ఇద్దరి మృతి

road-accident-image-done

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు టేకుల సోమారం వాసి శ్రీకాంత్, ముక్తాపూర్ వాసి యాదగిరిగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.