Home తాజా వార్తలు బ్రిడ్జ్ గోడను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి

బ్రిడ్జ్ గోడను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి

Bike-accident

వరంగల్ రూరల్: బ్రిడ్జ్ గోడను బైక్ ఢీకొన్న ఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపెల్లి క్రాస్ రోడ్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ బ్రిడ్జ్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.