Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

వేడుకలో విషాదం

Road-accident1

భద్రాచలం: స్థానిక గోదావరి నది వంతెనపై ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో ఓకరు మృతి చెందగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం గోదావరి నదిపై ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు బలంగా ఢీ కోట్టుకున్నాయి . ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన ఇరువుని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రమాదం బూర్గంపాడు మండల లిమిట్స్‌లో జరిగినందున ఆ పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాదా బాధితుల వివరాలుతెలియాల్సి ఉంది.

ఖమ్మం క్రైం: ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, ప్రకాష్‌నగర్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రాఫిక్ ఎఎస్‌ఐ మదార్ తెలిపిన వివరాల ప్రకారం….. పందుల వినోద్‌బాబు (30) మల్కాపురం గ్రామం జగ్గయ్యపేట మండలం కృష్ణజిల్లాకు చెందిన ఇతను రెండు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో ఎస్‌కె నాగుల్‌మీరా అద్దె బస్సు యాజమాని దగ్గర ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

కొత్త సంవత్సరం సందర్బంగా మల్కాపురం వెళ్లడానికి ఖమ్మం మీదుగా బయలుదేరగా బ్రిడ్జి సమీపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో వెంకటగిరి నుంచి వస్తున్న శ్రీనివాసరావు అనే ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో వినోద్‌బాబు అక్కడికక్కడే తలకు బలమైన గాయాలై మరణించారని తెలిపారు. శ్రీనివాసరావు పూర్తి వివరాలు తెలియరాలేదన్నారు. ఎస్‌ఐ దేవేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Comments

comments