Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అదుపుతప్పి బోల్తాపడిన కారు: ఇద్దరి మృతి

ప్రమాద స్థలం వద్దే ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

Road-Accident-in-Nagarkurno

మనతెలంగాణ/అచ్చంపేట: దైవదర్శనానికి బయలుదేరిన ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ  కుటుంబం హైదరాబాద్ నుండి  శ్రీశైలం వెళ్తుండగా మార్గంమధ్యలో కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.   హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన అంజిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో శనివారం ఉదయం బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో దోమలపెంటకు 5కిలో మీటర్ల దూరంలో కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పై ఫల్టీలు కొడుతూ బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరు మంది కుటుంబ సభ్యులలో అంజిరెడ్డితో పాటు ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయ పడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments