Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

లారీని ఢీకొట్టిన టెంపో: ఇద్దరి మృతి

Tempo-Accident

అమరావతి: ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టిన ఘటన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టెంపో వాహనం విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన స్వరూప్‌ఘోష్‌, జయరాం చౌదరి గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments