Home రాష్ట్ర వార్తలు వాషింగ్ మెషిన్ షాక్

వాషింగ్ మెషిన్ షాక్

తల్లీ కొడుకు దుర్మరణం, హైదరాబాద్‌లో విషాదం

washing-macమన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ చిల కలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబర్‌నగర్‌లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతుకుతుండగా విద్యుద్ఘాతానికి గురై తల్లీకొడుకు మృతి చెందిన విషాదకర సం ఘటన ఇది. 16 నెలల వయసు కలిగిన కూతురిని మంచానికి కట్టి వేసి ఉంచడంతో ప్రాణాలు దక్కిం చుకుంది. శుక్రవారం ఉదయం హలీమున్నీషా తన ఇంట్లో వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసి కరెం ట్ స్విచ్ ఆన్ చేసింది. మెషిన్ నుంచి వచ్చే వృథా నీరు అడుగు ఎత్తున అక్కడే నిలిచిపోయింది. వాషింగ్ మెషిన్ వైరు ఎలుకలు కొరకడంతో రాగి తీగెలు ద్వారా నీటిలోకి విద్యుత్ సరఫరా జరి గింది. దీన్ని గమనించని హలీమున్నీషా నీటిలో కాలు పెట్టింది. తీవ్రమైన విద్యుత్‌షాక్‌కు గురై అక్కడే పడిపోయి ప్రాణాలు విడిచింది. అక్కడే ఆడుకుంటున్న మూడేళ్ల కుమారుడు జునైద్ రెహ మాన్ కిందపడిన తల్లి దగ్గరకు వచ్చి ఆమెను పట్టు కోవడంతో బాబుకు కూడా విద్యుత్‌షాక్ తగి లింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు ఇం ట్లో ఎవరూ లేకపోవడంతో వారిద్దరు ప్రాణాలు వదిలారు. కొద్దిసేపటి తర్వాత స్థానికంగా ఉండే బంధువు ఫర్వేజ్ వచ్చి చూసే సరికి తల్లి, కొడు కులు చనిపోయి ఉండటాన్ని గమనించాడు. చిన్నారి సమ్రీన్ గట్టిగా ఏడుస్తోంది. ఆమెను తల్లి తాడుతో కట్టి ఉంచడంతో ఆ బాలిక బతికింది. ఈమె కూడా తల్లి వద్దకు వచ్చి ఉంటే విద్యుత్ షాక్‌తో మరణించి ఉండేది. 15 నెలల కుమార్తె సమ్రిన్ ఇళ్లంతా తిరుగుతు అల్లరి చేస్తుందని తాడుతో మంచానికి కట్టివేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి పరిశీలించారు. నాసిరకం వాషింగ్‌మెషిన్ వాడడం, వైర్లు ఎలుకలు కొరికివే యడంతో విద్యుత్‌షాక్‌కు గురై తల్లికొడుకులు మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు. కాగా తన కుమార్తెను అల్లుడు అశ్రఫ్‌ఖాన్ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, నాలుగు నెలల క్రితం జమాత్‌కు వెళ్లి ఈ నెల 14వ తేదీన వచ్చి, భార్యతో గొడవపడి చేగుంట వెళ్లిపోయాడని, మరుసటి రోజే ఈ ఘటన జరిగిందని, లోతుగా విచారణ చేపట్టాలని మృతురాలి తండ్రి ఎంఏ సఫియుద్దీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.