Home తాజా వార్తలు కారు బోల్తా: ఇద్దరికి గాయాలు

కారు బోల్తా: ఇద్దరికి గాయాలు

Two Members Injured in Car Roll Over Accident in NagarKurnool

నాగర్ కర్నూల్: పెంట్లవెల్లి మండల పరిధిలోని చౌటచెరువు నమాజు కట్ట వద్ద సోమవారం సాయంత్రం కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  టిఎస్15యూఏ 7091 అనే నంబరు గల కారులో బండారు శివ, బాలస్వామి అనే వ్యక్తులు కోల్లాపూర్ లో కోర్టు పని మీద వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి చోటచేరువు వద్ద బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో బండారు శివ(25), బాలస్వామి(26) అనే వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  కారు అతివేగంగా నడపడంతో కారు ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని పెంట్లవెల్లి ఎస్సై సైదయ్య తెలిపారు.