Home తాజా వార్తలు అగ్నిగుండంలో పడిన భక్తులు: ఇద్దరి పరిస్థితి విషమం

అగ్నిగుండంలో పడిన భక్తులు: ఇద్దరి పరిస్థితి విషమం

Fire

ఆంధ్రప్రదేశ్: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఆదివారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. రాయచోటి వీరభద్రుని ఉత్సవాల్లో భాగంగా అగ్ని గుండంలో ఇద్దరు భక్తులు నడుచుకుంటూ వెళ్లి జారి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  గాయపడినవారు లక్ష్మీదేవమ్మ, రామాంజనేయమ్మగా గుర్తించారు. గుండంలో పడిన భక్తులను కాపాడేటప్పుడు ఫైర్ కానిస్టేబుల్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు.