Search
Sunday 23 September 2018
  • :
  • :

కారు, బైక్ ఢీకొని: ఇద్దరికి తీవ్రగాయాలు

Accident

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు-బైక్ ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్సై అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ నుండి సలీమ్ షేక్(35),దాహుద్ షేక్(56)లు బైక్ పై పెద్దషాపూర్ కు వెళ్తు వెనక నుండి కారు (నెం.టీఎస్06 యుబి6802) బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి కాలు విరిగింది. గాయపడి రోదిస్తున్న వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ కారును వదిలి సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments