Home తాజా వార్తలు వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు ఆత్మహత్య

వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు ఆత్మహత్య

Suicide

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఆదివారం ఉదయం వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కెపిహెచ్ బి పరిధిలోని హెచ్ఎంటి హిల్స్ లో ధన లక్ష్మి (24) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఘటకేసర్ మండలంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Two Members Suicide in Medchal

 

Telangana news