Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎంసెట్ శ్కాం కేసులో సిఐడి కస్టడీకి ఇద్దరు

eamcet-2

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ శ్కాం కేసులో నిందితులు వాసుబాబు (A89), శివనారాయణ రావు(A90)ను సిఐడి తమ కస్టడీలోకి తీసుకుంది. వారిని చంచల్‌గూడ జైలు నుంచి సిఐడి కార్యాలయానికి తరలించారు. నిందితులను ఆరు రోజుల పాటు సిఐడి కస్టడీలోకి  తీసుకోవటానికి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఎంసెట్ శ్కాంలో అసలు సూత్రదారులపై అధికారులు ఆరా తీస్తున్నారు. కార్పొరేట్ కళాశాల వెనకున్న శక్తుల గుట్టు విప్పేందుకు సిఐడి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విద్యార్థులు, ఉద్యోగులు నిందితులుగా మారడంతో యాజమాన్యాల పాత్ర ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వారం రోజులు మెడికో గణేష్ ను కస్టడీకి తీసుకుంటామని కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ శ్కాంలో మరో పది మంది ఉన్నట్టు సిఐడి గుర్తించింది.

Comments

comments