Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

SHOT-DIED

శ్రీనగర్ : భారత భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్ బిజెపి నేత అన్వర్‌ఖాన్‌పై గురువారం ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుల్వామా జిల్లాలోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Two Militants were shot dead by Security Forces

Comments

comments