Home తాజా వార్తలు వాహనాలు నడిపిన ఇద్దరు మైనర్లకు జైలు…

వాహనాలు నడిపిన ఇద్దరు మైనర్లకు జైలు…

minor-arrest

హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలు ఉల్లంఘిస్తూ కారు, ఆటోను నడిపిన ఇద్దరు మైనర్లకు ఐదోవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జువైనల్ కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించినట్టు ఫలక్ నుమా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సిహెచ్ నరేందర్ రావు చెప్పారు. మారుతి స్విప్టు కారు నడుపుతూ మహ్మద్ ఒమర్ (17) బండ్లగూడ దగ్గర ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. సైదాబాద్ కు చెందినా షంశీర్ అలీఖాన్ (17) ఆటో తోలుతూ మిథాని వద్ద పోలీసుల వలకు చిక్కాడు. వీరిపై చార్జిషీట్లు దాఖాలు చేయడంతో వారికి  న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.