Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

టాలీవుడ్‌లో రెండు ఆఫర్లు

amal

యంగ్ బ్యూటి అమలాపాల్ సినిమాల కన్నా ఎక్కువగా వివాదస్పద వార్తలతోనే అందరికి దగ్గరైంది. ఈ భామ తమిళ్, మలయాళ సినిమాలు ఎక్కువగా చేసిందే తప్ప టాలీవుడ్‌లో పెద్దగా నటించలేదు. ఆమధ్య నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో మెరిసిన అమలాపాల్‌కు ఆతర్వాత అవకాశాలు అంతగా రాలేదు. అయితే ఇప్పుడు ఈ కేరళ బ్యూటీకి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలిసింది. ఈమధ్య తెలుగులో నటిస్తున్న స్టార్ హీరోయిన్లు రెమ్యునరేషన్‌ను బాగా పెంచేయడంతో దర్శక నిర్మాతలు యంగ్ హీరోయిన్లపై దృష్టిపెట్టారు. దీంతో మీడియంగా రెమ్యునరేషన్‌ను తీసుకునే అమపాల్‌కు అవకాశాలు వస్తున్నాయట. అయితే ఈ భామ తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే ఎంపికచేసుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు రెండు మంచి ఆఫర్లు దక్కినట్లు తెలిసింది. నాగార్జున, మంచువిష్ణు సినిమాల్లో ఆమె నటించనున్నట్లు సమాచారం. మంచు విష్ణు నెక్స్ మూవీలో ఆమెను దాదాపుగా ఖరారు చేశారు. ఇక నాగార్జున, నాని కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్‌లో అమలాపాల్  హీరోయిన్‌గా సెట్ అయ్యింది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటికే కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంపికచేశాడు. భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

Comments

comments