Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రైలు నుంచి జారిపడి ఇద్దరు యువకులు మృతి

రైలు నుంచి జారిపడి ఇద్దరు యువకులు మృతి

Man Suspicious Deathఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం నర్సీపట్నం రోడ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.