Home జాతీయ వార్తలు అపార్ట్‌మెంట్‌లో పాముల అమ్మకం : ఇద్దరి అరెస్ట్

అపార్ట్‌మెంట్‌లో పాముల అమ్మకం : ఇద్దరి అరెస్ట్

SNAKESపూణె : నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా పాములను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదకరమైన 41 రస్సెల్స్ వైపర్, 31 కోబ్రాలతో పాటు పలు రకాల పాములను పోలీసులు గుర్తించారు. ఓ గదిలో చెక్క పెట్టెలు, గోనె సంచుల్లో ఉన్న పాములను ఉంచినట్లు పేర్కొన్నారు. పాములను అమ్ముతున్న వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.