Home తాజా వార్తలు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఆత్మహత్యాయత్నం

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఆత్మహత్యాయత్నం

SUICIDE1

కరీంనగర్‌ : టిఆర్ఎస్ ఎమ్మెల్యే, గాయకుడు రసమయి బాలకిషన్‌ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలంలో అల్గునూరులో భూపంపిణీ పథకంలో అర్హులకు అన్యాయం చేశారని నిరసన వ్యక్తంచేస్తూ పరుశురామ్‌, శ్రీనివాస్‌ అనే ఇద్దరు యువకులు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పటించుకున్నారు. దీంతో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.