Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సుకు తల్లి, కొడుకు బలి

two people died in road accident

హన్మకొండ అశోకా టాకీస్ జంక్షన్‌లో ఘోర విషాదం

మనతెలంగాణ/సుబేదారి : హన్మకొండ అశోకా టాకీస్ జంక్షన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ క్రాస్ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే..మడిపల్లి నుంచి హన్మకొండ బస్‌స్టేషన్‌కు వెళుతున్న మడిపల్లి 2 ఎం డిపోకు చెందిన (ఎపి10జడ్ 3339)గల ఆర్‌టిసి బస్సు రాంగ్‌రూట్‌లో బస్సు నడపడం వల్ల అటుగా వెళ్తున్న పాపాని సరిత(30) కుమారుడు రుత్విక్ (10) బస్సు ఢీకొట్టడం వల్ల ప్రాణాలతో కొట్టుమిట్టాడారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలపాలైన పాపాని సరితను హుటాహుటిన ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరిత మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ప్రమాదంలో మరణించిన తల్లి కుమారులు ఆత్మకూరు గ్రామానికి చెందినవారు కాగా వృత్తరీత్యా బ్రాహ్మణవాడలో నివాసం ఉంటున్న పాపాని సరిత ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. షాపింగ్ నిమిత్తమై తన కుమారునితో వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. హన్మకొండ ఇన్‌స్పెక్టర్ సంపత్‌రావు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్షంగా రాంగ్‌రూట్‌లో బస్సు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, ఆర్‌టిసి బస్సు, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments