Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఇటలీలో ఘోర ప్రమాదం

italy : Two People dies After Truck Crash

రోమ్ : ఇటలీలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పేలుడు పదార్థాలతో వెళుతున్న ఓ ట్రక్కు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి రోడ్డు పోక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 70 మంది గాయపడ్డారు. ఉత్తర ఇటలీలోని బొలోగ్నా నగరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి ఘటనాస్థలి సమీపంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Two People dies After Truck Crash in italy

Comments

comments