Home జాతీయ వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two People Killed in Road Accident

విజయనగరం : గజపతినగరం మండలం పెదమానాపురం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతులు దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two People Killed in Road Accident