Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రెండు బైకులు ఢీ…ఇద్దరికి తీవ్ర గాయాలు

Two people seriously injured during a bike accident

తిరుమలగిరి(సాగర్) : రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మండలంలోని శ్రీరాంపురం గ్రామానికి చెందిన ఐతబోయిన ఆంజనేయులు, పోలగాని శివలు శుద్ధి చేసిన తాగునీటి కోసం అల్వాల ఎక్స్ రోడ్డు వద్దకు తమ ద్విచక్రవాహనంపై వెళ్లారు. అదే గ్రామానికి చెందిన గజ్జెల భిక్షంరెడ్డి హాలియాలో తన వ్యక్తిగత పనులు ముగించుకొని శ్రీరాంపురం గ్రామానికి అతి వేగంతో వస్తుండగా మార్గ మధ్యలో ఆంజనేయులు ద్విచక్ర వాహనాన్ని భిక్షంరెడ్డి ఢీ కొట్టడంతో ఆంజనేయులు వాహనంపై వెనక కూర్చున్న శివ బైకుపై నుంచి ఎగిరి కిందపడ్డాడు. దీంతో శివ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ముగ్గురిని హైదరాబాద్‌కు తరలించారు. భిక్షంరెడ్డి అతివేగంతో రావడంతోనే ఆంజనేయులు, శివకు బలమైన గాయాలయ్యాయని ఆంజనేయులు తమ్ముడు శ్రవణ్ స్థానిక ఎస్‌ఐ కురుమయ్యకు తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కురుమయ్య తెలిపారు.

Comments

comments