Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

విద్యుత్ ఘాతంతో ఇద్దరు దుర్మరణం

Two Persons Died With Current Shock

అల్లాదుర్గం: మండలంలోని చిల్వర్ గ్రామ శివారులో విద్యుత్ ఘాతానికి గురై ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. చిల్వర్ గ్రామానికి చెందిన కుసంగి సంగమేశ్వర్‌గౌడ్(45) అనే కల్లుగీత కార్మికునితో పాటు అదే గ్రామానికి చెందిన మహ్మద్ షాహిన్‌వాజ్(15) అనే విద్యార్థి బుధవారం గ్రామ సమీపంలో ఈత వనంలోకి కల్లును గీసేందుకు వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. విధులు ముగించుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా మహ్మద్ యూసుఫ్‌కు చెందిన మామిడి తోట చుట్టూ ఉన్న పెన్షింగ్ వైరుకు కరెంటు సరఫరా కావడంతో దానికి తగిలి మహ్మద్ షాహిన్‌వాజ్ కరెంటు షాక్‌కు గురికాగా బాలున్ని రక్షించే ప్రయత్నంలో సంగమేశ్వర్‌గౌడ్‌కు సైతం విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం రాత్రి ఇరువురు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వారి కోసం గాలించగా ఫలితం లభించేదు. గురువారం ఉదయం అటువైపు వెళ్తున్న రైతులు విద్యుత్‌షాక్‌ గురైన వీరిని గమనించి గ్రామస్థులకు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా అల్లాదుర్గం సిఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ మహ్మద్‌గౌస్, టేక్మాల్ ఎస్ఐ ఎల్లాగౌడ్‌లు చేరుకొని విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments