Home రాజన్న సిరిసిల్ల సెటిల్మంట్లు.. దందాలు

సెటిల్మంట్లు.. దందాలు

  • ఇద్దరు యువకుల అరెస్టు
  • ఆక్రమ ఆయుధాలు స్వాధీనం

Siricilla-Settlementsసిరిసిల్ల : సెటిల్‌మెంట్ దందాలకు పాల్పడుతూ, బెదిరింపు లకు దిగుతున్న ఇద్దరు యువకులను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. అ రెస్టైన వారి నుంచి పోలీసులు డమ్మీ తుపాకులను స్వాధీనం చేసుకున్నా రు. వారు ఉపయోగించిన హోండా సిటి కారు, ఇన్నోవా వాహనాలను సీజ్ చేసారు. డిఎస్‌పి సుదాకర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వె ళ్లడించారు. బోయిన్‌పల్లి మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన అన్నబోయిన తిరుపతి యాదవ్, అన్నబోయిన నాగార్జున యాద వ్ నేర ప్రవృతి కలిగి ఉన్నారు. 2011లో కుటుంబ కలహాలతో సొంత తండ్రినే హత మార్చారు. గ్రామంలో పలువురితో శత్రు త్వం కలిగి ఉన్న వీరు సెటిల్‌మెంట్ దందా లు చేస్తూ, పంచాయతీలు నిర్వహిస్తూ బెది రింపులకు పాల్పడుతున్నారు.గతంలో తు పాకి లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోగా వీరి నేర ప్రవృతి కారణంగా లైసెన్స్ నిరా కరించారు. సిరిసిల్ల పట్టణంలో అనుమానా స్పదంగా తిరుగుతున్న వీరిని సి సిఎస్ పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు బొమ్మ తుపాకులు, ఒక టాయ్ రివాల్వర్, ఎయిర్‌గన్, మూడు తల్వార్‌లు, కత్తులు, రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్ర యాణిస్తున్న హోండా సిటి కారు, ఇన్నోవా వాహనాలను సీజ్ చేసారు. వీరిపై 553, 384, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమో దు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ రవీందర్, సిసిఎస్ ఎస్‌ఐ విద్యా సా గర్, హెడ్ కానిస్టేబుల్ పాల్గొనారు.