Home తాజా వార్తలు మైనర్ బాలికపై ఇద్దరు పోలీసుల అఘాయిత్యం

మైనర్ బాలికపై ఇద్దరు పోలీసుల అఘాయిత్యం

Rape on Girl in Andhra Pradesh

రాంచీ: జార్ఖండ్ లో బుధవారం దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రజల మానాలు, ప్రాణాలు రక్షించిన పోలీసులు… కామంతో కళ్లుమూసుకపోయి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.  మైనర్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన వారిలో ఇద్దరు పోలీసులు ఉన్నారు.  రేప్ చేసిన వారిలో డిఎస్ పి అధికారి ఉన్నట్టు సమాచారం.  సిద్దిబాత్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కు సదరు బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సిఐడితో విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశ్లీల దృశ్యాలు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాలిక ఆరోపణలు చేసింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సిఐడి అధికారులు వెల్లడించారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.