Home రాజన్న సిరిసిల్ల ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Sand-Mafia1

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామ శివారులోని మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చే స్తున్న ఏడు ట్రాక్టర్లను బుధవారం ఎల్లారెడ్డిపేట సిఐ రవీందర్ పట్టుకు న్నారు. సిఐ రవీందర్ వివరాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలంలో పలు అవసరాల కోసం తహసీల్దార్ ప్రభుత్వం నిర్దేశించిన వెంకటాపూర్ శివా రులోని మానేరు వాగు నుంచి ఇసుకకు అనుమతించగా దానికి విరుద్ధ ్దంగా నారాయణపూర్ శివారు నుంచి ఇసుకను తీస్తున్నట్లు పలువురు రై తులు తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు సిబ్బందితో వెళ్లగా సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.