Home హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌కు అంతర్జాతీయ సొబగులు

నెక్లెస్‌రోడ్‌కు అంతర్జాతీయ సొబగులు

Two separate aerial bridges

ఔషధ మొక్కల వనం… లేక్ వ్యూఫ్రంట్ పార్కు
రెండు ప్రత్యేక ఆకాశ వంతెనలు
పర్యాటకుల చెంతకే మొబైల్ హోటల్

మన తెలంగాణ/సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర తీరాన ఉన్న నెక్లెస్‌రోడ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండిఎ నిర్ణయించింది. ఈపాటికే ఆ రోడ్డుకు పర్యాటక ప్రాంతంగా పేరున్నది. ఇప్పుడు ఆ మార్గానికి ప్రపంచస్థాయిలో మరింత శోభను తీసుకురావడానికి, ఆహ్లాదాన్ని అందించేందుకు నూతన ప్రణాళికలను రూపొందించింది. లేక్‌వ్యూ ఫ్రంట్ పార్కు, ఔషథ మొక్కల వనం, రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, మొబైల్ హోటల్ వంటివి ఏర్పాటు చేయాలని కమిషనర్ చిరంజీవులు నిర్ణయించారు. ఈ మేరకు వీటిపై ఒక ప్రత్యేక నివేదికను సిద్దంచేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్ ప్రాంతాలు హైదరాబాద్ మహానగరానికి సహజంగా చేకూరిన ప్రకృతి సంపద. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మార్చాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు గతంలోనే హెచ్‌ఎండిఏ అధికారులకు సూచించారు. దీంతో కమిషనర్ చిరంజీవులు ఆ ప్రాంతాన్ని ఏవిధంగా తయారుచేస్తే అందంగా, ఆహ్లాదంగా, సుందరంగా, పర్యాటకులకు లోటు లేకుండా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

వ్యూపాయింట్‌గా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి…
నెక్లెస్‌రోడ్డులోని సంజీవయ్య పార్కు, పివిఘాట్ ప్రాంతాల్లో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునేట్టుగా ప్రత్యేక నమూనాలతో రెండు ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలను వ్యూ పాయింట్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని అథారిటీ నిర్ణయించింది. కనీసంగా 2530 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్డీలను నిర్మించడంతో పాటు పైన హుస్సేన్‌సాగర్ పరిసరాలను పూర్తిగా తిలకించేందుకు, ఫోటోలు దిగేందుకు వీలుగా తీర్చిదిద్దాలని, కనీసంగా 20 మంది నిలిచేందుకు అనువుగా ఏర్పాటుచేయాలనేది అధికారుల అభిప్రాయం. దీనికి తోడు 3 ఎకరాల్లో ఔషథ మొక్కల వనాన్ని ఏర్పాటు చేశారు. ఆగష్టులో ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని దాటి మరికొంత దూరం వెళ్ళగానే 10 ఎకరాల్లో లేక్ వ్యూ ఫ్రంట్ పార్కును రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఆగష్టులో శంఖుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కిషోర్ ప్రధాన్ అనే ఆర్కిటెక్చర్‌తో ప్లాన్‌లు వేయించారు. ఈ పార్కులోనూ హుస్సేన్‌సాగర్ నీటిపైకి సుమారు 15 అడుగుల ఎత్తుతో వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. సంజీవయ్య పార్కుకు సమీపంలోనే అత్యాధునిక పద్దతిలో నూతనంగా మొబైల్ హోటల్‌ను ఏర్పాటు చేసేందుకు టెండర్లను పిలవాలని నిర్ణయించారు. ఈ హోటల్‌కు వచ్చేవారికి వారివారి వాహనాల వద్దకే ఆహారాలను, తినుబండారాలను, శీతల పానీయాలు, చాట్ వంటి అందిస్తారు. పర్యాటకులు తమ వాహనంలోనే కూర్చుని విందును ఆరగించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ హోటల్ కోసం స్థల పరిశీలన చేశారు. హోటల్ సంస్థలను పిలిచి వారి నమూనాలను, విధానాలను, మెనును తెలుసుకోవాలని భావిస్తున్నారు. అయితే, ఈపాటికే ఇక్కడ శీతాకోక చిలుకల పార్కు, దేశంలోనే భారీ జాతీయపతాకం దేశ విదేశీయ పర్యాటకులను ఆకట్టుకున్నవి.

పర్యాటకులకు కొత్త అనుభూతి : కమిషనర్ చిరంజీవులు

పర్యాటకులు హుస్సేన్‌సాగర్ తీ రాన ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక ఏ ర్పాట్లు చేస్తున్నామని, ఆగష్టు నుండి ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి రానున్నట్టు కమిషనర్ చిరంజీవులు తెలిపారు. నగరానికి వచ్చిన వారు ప్రత్యేకంగా నెక్లెస్‌రోడ్ అందాలను తిలకించేందుకు వచ్చేట్టుగా ఆధునిక ప ద్దతుల్లో సహజ సిద్దమైన ప్రకృతి అందాలను తీసుకురానున్నట్టు తెలిపారు.