Home జాతీయ వార్తలు అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి

అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి

SISTERS

ఢిల్లీ : నోయిడాలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్49లో అక్కాచెల్లెళ్లు ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు వారు వేలాడుతూ కనిపించారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా… హత్యకు గురయ్యారా … అన్న విషయం తేలాల్సింది. అయితే వీరి తలిదండ్రుల వాదన మరోలా ఉంది. తమ దూరపు బంధువైన రవి అనే వ్యక్తి తమ పిల్లలను చంపి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం రవి తమ పిల్లలతో గొడవ పడ్డాడని వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారా …. హత్యకు గురయ్యారా … అన్న విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తేలుతుందని పోలీసులు చెప్పారు.

Two Sisters Mysterious Death